Posts

Showing posts from May, 2020

ఒకే సృష్టికర్త మానవులను అనేక ధర్మాల వారీగా విభజించాడా?

మనం చూస్తున్న మతాలు అన్నీ ఆ సృష్టికర్త ఆదేశించినవేనా? వీటిలో ఏదో ఒక మతాన్ని మనం అనుసరిస్తే ఆ దైవాన్ని చేరుకోగలమా? మనం దేవుళ్ళు ఎంతమంది అని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఏ మతానికి చెందినవరైనా “దేవుడు ఒక్కడే” అనే సమాధానం ఇస్తారు. ఆ ఒక్క దేవుడే ఈ అనంత విశ్వానికి కర్త మరియు యజమాని. ఆయనే సమస్త ఉనికికి కారణమైన వాడు. కాబట్టి మానవులకు అనేక సృష్టికర్తలు (దేవుళ్ళు) లేరు! అలాకాదని ఇండియాకు ఒక దేవుడు, జపాన్ కోసం వేరే దేవుడు, అమెరికాకు వేరే దేవుడు ఉన్నాడు అని అనటం అలాగే ఇండియాలో ఆంధ్రాకు ప్రత్యేక దేవుడు ఉన్నాడు, కేరళ కోసం వేరే దేవుడు, ఢిల్లీ వారి కోసం వేరే దేవుడు ఉన్నాడు అనటం విచిత్రమైన విషయం అవుతుంది. మరి అదేవిధముగా వర్షం కురిపించటానికి ఒక దైవం, జ్ఞానం ప్రసాదించటానికి మరొక్క దైవం, ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి వేరే దైవం ఉన్నారు అనటం కూడా విచిత్రమైన విషయమే. మన బుద్ది – వివేచనాలను ప్రశ్నిస్తే అవే సమాధానమిస్తాయి అందరికీ సృష్టికర్త (దేవుడు) ఒక్కడే అని, కానీ ఆయనను వివిధ భాషల వారు వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఇలా ఆయనను పిలుచుకునే పేర్లు అనేకమైన దేవుడు మాత్రం అనేకం కాడు అనే విషయం అర్ధంచేసుకోవాలి. ఆ ఒక్

మొఘల్ _ కారణంగా హిందువులలో పర్దా?

మొఘల్ _ కారణంగా హిందువులలో పర్దా? ***********************************  భారతదేశంలొని మహిళల్లో ఎటువంటి వీల్ (ముఖాన్ని రక్షించడానికి లేదా దాచడానికి మహిళలు ధరించే వస్త్రం) ఆచారం లేదని, ఇది మొఘల్ యొక్క చెడు కళ్ళ నుండి మహిళలను కాపాడటానికి మొఘల్ పాలన కారణంగా ప్రారంభం అయిందని భారతీయ ద్వేషపూరిత ప్రచారాలు చెబుతున్నాయి. ఏదైనా వస్త్రము / బట్టతో తల కప్పుకోవడం మంచిదా కాదా? మేము ఈ విషయాన్ని దీనిని చదివే వారి జ్ఞానానికి వదిలేస్తున్నాము. ఏవైతే ఆరోపణలు మనం వింట ఉంటామో వాటిపై దృష్టి పెడదాము. వేలాది సంవత్సరాలు కలిసి జీవించడం వల్ల హిందువులు, ముస్లింలు ఒకరినొకరు సాంస్కృతికంగా ప్రభావితం చేశారన్నది నిజం.  ఇది చాలా సహజమైనది. శతాబ్దాలుగా హిందూ మహిళలు, తమ మామగారి ముందు, భర్త యొక్క అన్నయ్య ముందు (బావ) మరియు కుటుంబంలోని ఇతర పెద్దల ముందు ముసుగు వేసుకునే వారు / తలను కప్పుకునే వారు (దీనిని ప్రముఖంగా ఘున్‌ఘాట్ అని పిలుస్తారు). సహజముగా వీరు ముఘల్ కి సంబంధించిన వారు కారు.  భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నివసించే నేటి మహిళలు ఘన్‌ఘాట్ ను/ వీల్‌ను (బట్టతో తల కప్పుకోవడం) ఎందుకు ఇంకా ఆచరిస్తున్నారు?  వారు మొఘల్ చ

సనాతన ధర్మంలో ఆదం

Image
సనాతన ధర్మంలో ఆదం ****************************************** 1. పురాణాలలో - 'ఆదం' అన్న పదాన్ని 'ఆదం' కోసం ఉపయోగించడం జరిగింది మరియు హవ్వాను హవ్యవతిగా పేర్కొనడం జరిగింది.   http://www.astrojyoti.com/bhavishyapurana-2.htm 2. వేదాలలో - 'మను' అన్న పదం చాలాసార్లు ప్రస్తావించబడింది, వాటిలో కొన్ని ఆదం కోసం ఉపయోగించబడ్డాయి. 3. రామ్‌చరిత్‌మనస్‌లో - 'ఆదం'ను స్వయంభూమను [తల్లిదండ్రులు లేకుండా, స్వయంగా అయిపోయిన మను] అని ప్రస్తావించడం జరిగింది . Ramcharitmanas, BaalKaand, doha 141, Chaupaai 1