మొఘల్ _ కారణంగా హిందువులలో పర్దా?

మొఘల్ _ కారణంగా హిందువులలో పర్దా?
***********************************

 భారతదేశంలొని మహిళల్లో ఎటువంటి వీల్ (ముఖాన్ని రక్షించడానికి లేదా దాచడానికి మహిళలు ధరించే వస్త్రం) ఆచారం లేదని, ఇది మొఘల్ యొక్క చెడు కళ్ళ నుండి మహిళలను కాపాడటానికి మొఘల్ పాలన కారణంగా ప్రారంభం అయిందని భారతీయ ద్వేషపూరిత ప్రచారాలు చెబుతున్నాయి.

ఏదైనా వస్త్రము / బట్టతో తల కప్పుకోవడం మంచిదా కాదా? మేము ఈ విషయాన్ని దీనిని చదివే వారి జ్ఞానానికి వదిలేస్తున్నాము. ఏవైతే ఆరోపణలు మనం వింట ఉంటామో వాటిపై దృష్టి పెడదాము.

వేలాది సంవత్సరాలు కలిసి జీవించడం వల్ల హిందువులు, ముస్లింలు ఒకరినొకరు సాంస్కృతికంగా ప్రభావితం చేశారన్నది నిజం.  ఇది చాలా సహజమైనది.
శతాబ్దాలుగా హిందూ మహిళలు, తమ మామగారి ముందు, భర్త యొక్క అన్నయ్య ముందు (బావ) మరియు కుటుంబంలోని ఇతర పెద్దల ముందు ముసుగు వేసుకునే వారు / తలను కప్పుకునే వారు (దీనిని ప్రముఖంగా ఘున్‌ఘాట్ అని పిలుస్తారు). సహజముగా వీరు ముఘల్ కి సంబంధించిన వారు కారు.

 భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నివసించే నేటి మహిళలు ఘన్‌ఘాట్ ను/ వీల్‌ను (బట్టతో తల కప్పుకోవడం) ఎందుకు ఇంకా ఆచరిస్తున్నారు?  వారు మొఘల్ చేత పరిపాలించబడుతున్నారా లేదా వారి కుటుంబ సభ్యులు ముఘల్ కి సంబంధించిన వారా?

కొంతమంది చాలా విచిత్రమైనవ వాదనలు చేసారు - "అజంతా మరియు ఎల్లోరా యొక్క చిత్రాలను చూడండి, మహిళలు తమ తలలను కప్పుకోరు", దీన్ని బట్టి పురాతన కాలంలో మహిళలు తమ తలలను కప్పుకోలేదని రుజువు అవుతోంది. అజంతా మరియు ఎల్లోరా చిత్రాలలో మహిళలు నగ్నంగా ఉండటమే కాకుండా సాధ్యమైనంత చెత్త మరియు అసభ్యకరమైన మార్గాలలో ప్రదర్శించబడ్డారని వారు చెప్పడం మరిచిపోయారు.  ప్రాచీన భారతీయ మహిళలు తమను తాము ఏవైనా బట్టలతో కప్పుకోలేదని లేదా సిగ్గులేనితనాన్ని బహిరంగంగా ఆచరించారని దీని అర్ధమా?  అస్సలు కానే కాదు!

ప్రతిదానికీ ముస్లింలను నిందించడం ఈ రోజుల్లో భారతీయ ద్వేషపూరిత ప్రచారాలకు అలవాటుగా మారింది.  భారతదేశం ఎంతో గౌరవించే వ్యక్తి, స్వామి వివేకానంద, హిందువుల ఈ వైఖరిని ఖండించారు.

'A girl of eight is married to a man of thirty, and the parents are jubilant over it.... And if anyone protests against it, the plea is put forward, "Our religion is being overturned." What sort of religion have they who want to see their girls becoming mothers before they attain puberty even and offer scientific explanations for it? Many, again, lay the blame at the door of the Mohammedans. They are to blame, indeed! Just read the Grihya-Sutras through and see what is given as the marriageable age of a girl...There it is expressly stated that a girl must be married before attaining puberty. The entire Grihya-Sutras enjoin this. And in the Vedic Ashvamedha sacrifice worse things would be done... All the Brâhmanas mention them, and all the commentators admit them to be true. How can you deny them?
What I mean by mentioning all this is that there were many good things in the ancient times, but there were bad things too. The good things are to be retained, but the India that is to be, the future India. must be much greater than ancient India.'

Source: The Complete Works of Swami Vivekananda/Volume 6/Epistles - Second Series/LXXI Rakhal
https://en.wikisource.org/wiki/The_Complete_Works_of_Swami_Vivekananda/Volume_6/Epistles_-_Second_Series/LXXI_Rakhal

అంతేకాక, హిందూ సంప్రదాయాలలో మహిళలు తమను తాము కప్పుకోవడం మరియు చాల సాధారణమైనటువంటి దుస్తులు ధరించడం గురించి సూచనలు ఉన్నాయి.

రిగ్వేదం యొక్క ఒక మంత్రం గురించి జాగ్రత్తగా ఆలోచించండి.

"స్త్రీలు తమ వస్త్రధారణలో మరియు ప్రవర్తనలో అనుకువగా ఉండాలి, చూపులను కిందకు ఉంచాలి, శరీరం కప్పబడి ఉండాలి". రిగ్వేదం 8:33:19 పండిట్ హరిషరన్ సిద్ధాంతాలంకర్ వ్యాఖ్యానం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శోచనీయ ఘటన మరియు ఒక ఆధారంలేని ఆరోపణ

దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు - పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య

సత్యం వెలుగులో: హిందూ ధార్మిక గ్రంథాల ఫార్సీ మరియు ఉర్దూ అనువాదాలు