Posts

Showing posts from August, 2020

దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు - పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య

Image
 దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు  - పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య [హిందూ ధర్మ గొప్ప పండితులు మరియు గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు] పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య [1990 లో మరణించారు] వేదాలు మరియు హిందూ ధార్మిక గ్రంథాల యొక్క గొప్ప సనాతన-ధర్మ పండితులలో ఒకరు. ఆయన లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న గాయత్రి పరివార్ - హరిద్వార్ ఆధారిత మత సంస్థ / శాఖ స్థాపకులు. అఖండ్-జ్యోతి పత్రిక [గాయత్రి పరివార్ యొక్క అధికారిక పత్రిక] నుండి ఆయన రచన క్రింద ఉంది; జూన్ 1985 ఎడిషన్. హిందీ కొరకు: https://khurshidimam.blogspot.com/2016/08/blog-post.html ఈ విశ్వాన్ని సృష్టించినవాడు కేవలం ఒక్కడే. ఆయనే తన ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి, వృద్ధి మరియు పరివర్తన యొక్క అన్ని ప్రక్రియలను నిర్వహిస్తాడు. ఆయనకు  భాగస్వామి గాని సహాయకుడు గాని లేడు. దేవుని విషయంలో అందరు ఒకే విధమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఏకైక దేవుడి రాజ్యం అనేక మంది దేవుళ్ళ మధ్యలో విభజించబడింది మరియు ప్రజలు తమ ఇష్ట దైవాలను ఆరాధించి మరియు వాటికి మాత్రమే మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.  ఇంతటితో ఆగకుండా, ఇతర వర్గాలను (ఇతర దైవాలను ఆరాధించే వారిని) వ్యతిరేకించడం మరియు వారికి 

ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు? ముస్లిమేతరుల ప్రశ్నలు

ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు?   ముస్లిమేతరుల ప్రశ్నలు 1.   ప్రవక్త ఇబ్రహీం అ.స. వారు అల్లాహ్ ప్రసన్నత కోసం తన కొడుకును బలి ఇచ్చినప్పుడు , ముస్లింలు ఈదుల్ అజహ రోజు జంతు బలి ఎందుకు ఇస్తారు ? వాస్తవానికి ప్రవక్త ఇబ్రహీం అ.స. వారు ఏదైతే కలలో చూసారో దానిని నెరవేర్చడానికి పూర్తి స్పృహతో తన కొడుకును బలి ఇవ్వడానికి బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన తన కొడుకు గొంతుపై కత్తిని ఉంచినప్పటికీ , ఆయన బలి ఇచ్చింది ఒక జంతువును. అల్లాహ్ ఇబ్రహీం అ.స. వారిని పరీక్షిస్తున్నాడు. ఆ పరిక్ష ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం అతను తన అత్యంత విలువైన అనుబంధాన్ని, తన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేస్తాడా? లేదా?? అని. తన కొడుకును బలి ఇవ్వాలన్న ఉద్దేశాన్ని ఇబ్రహీం అ.స. వారు మానుకోలేదు, మరియు ఆయన చివరి వరకు తదనుగుణంగా వ్యవహరించారు. కాబట్టి దేవుడు ఇబ్రహీం అ.స. వారి కార్యాని స్వికరించి, అతని కుమారుడి స్థానాన్ని ఒక జంతువుతో భర్తీ చేశాడు. ఈ సంఘటనను స్మరించడానికి, ఆ రోజున జంతువులను బలి ఇవ్వమని మరియు మాంసాన్ని కుటుంబంలో , స్నేహితులతో, బంధువులతో మరియు పేదలతో పంచుకోవాలని దేవుడు విశ్వాసులందరికీ ఆజ్ఞాపించా