మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా?

మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా?

ప్రశ్న: మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా లేక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలా? దేవునికి విధేయత చూపటంలో మొదటి అడుగు భయభక్తులు అని నేను నమ్ముతున్నాను.
***************

జవాబు: "తఖ్వా" అనే అరబిక్ పదానికి సాధారణంగా "భయం" అని తప్పుగా అనువదించబడుతుంది. "తఖ్వా" అనే పదానికి ధాతువులు "వావ్ కాఫ్ యా" ప్రేమను సూచిస్తాయి. జంతువు, దెయ్యం లేదా చెడ్డ వ్యక్తులకు మనం భయపడుతున్నట్లు దేవునికి భయపడకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి.

ఒకరి పట్ల ప్రేమ పరాకాష్టకు చేరుకున్నప్పుడు భయం కలుగుతుంది. కానీ ఈ భయం విపరీతమైన ప్రేమ వలనే కాని భయానక విషయాల వల్ల కాదు. ఈ భయం మీరు ప్రేమించేవారికి అవిధేయత చూపకుండా నిరోధిస్తుంది. ఇలాంటి ప్రేమ / భయం భావననే “తఖ్వా” అంటారు. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఈ విధంగా తెలియజేస్తుంది.

"... విశ్వాసులైన వారు అల్లాహ్ ను అత్యధికంగా ప్రేమిస్తారు..." ఖుర్ఆన్ 2: 165

అంతే కాకుండా విశ్వాసులు అల్లాహ్‌ను ఎక్కువగా స్మరిస్తారు అని ఖుర్ఆన్ చెబుతుంది.

అదే సమయంలో ఖుర్ఆన్ విశ్వాసులకు ‘తఖ్వ’ కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తుంది, ఏదైతే అల్లాహ్ పట్ల భయం అని సాధారణంగా అనువదించబడుతుందో. భయానికి అరబీ భాషలో వేర్వేరు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని దయచేసి గమనించండి. కాని అవి అన్ని సాధారణంగా "భయం" అనే ఒకే పదంగా అనువదించబడతాయి.

కాబట్టి - అల్లాహ్ పట్ల "విపరీతమైన ప్రేమ" మరియు అల్లాహ్ పట్ల "భయం" – వీటిని ఎలా అర్ధం చేసుకోవాలి?

"అల్లాహ్ పట్ల భయం" మరియు జంతువు, దెయ్యం, అగ్ని, మునిగిపోవడం మొదలైన వాటిపై మీకు ఉన్న భయం ఒకటి కాదు. అల్లాహ్ పట్ల "భయం",  అల్లాహ్ పట్ల విపరీతమైన ప్రేమ ఫలితంగా వస్తుంది. మీరు అల్లాహ్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నప్పుడు, ఒక రకమైన "భయం" జనిస్తుంది దాని వల్ల మీకు అల్లాహ్‌ యొక్క అయిష్టత కష్టమనిపిస్తుంది, అటువంటి భయాన్ని ఇస్లాం ఆదేశిస్తుంది..

అల్లాహ్ పట్ల ఉన్న మీకు ఉన్న విపరీతమైన ప్రేమ కారణంగా మీరు అల్లాహ్ కు "భయపడాలి".

ఖున్ఆన్ భయం ఆధారిత విధేయత అనే తత్వానికి కట్టుబడి లేదు. ఖుర్ఆన్ విధానం దశల వారీగా:
1. దేవుని నిదర్శనాలు/సూచనలను చూడటం.
2. ప్రతి చోట ఉన్న దేవుని నిదర్శనాలను గురించి ఆలోచించటం.
3. ఎవరైనా నిదర్శనాల ద్వార తన అంతిమ సృష్టికర్తను విశ్వసిస్తే, అతడు / ఆమె దేవునిపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి.
4. దేవునిపై విశ్వాసం అంటే దేవుని సృష్టి నియమాలను విశ్వసించడం. ఈ సృష్టి నియమాలు మన నిజజీవితంలో అమలవుతుంటాయి. ఖుర్ఆన్ మరియు ప్రకృతి దేవుని సృష్టి నియమాల జ్ఞానాన్ని అందిస్తాయి.
5. దాని తరువాత ఆచరణ వస్తుంది. ఆచరణ దేవుని పట్ల విశ్వాసం మరియు ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో, అంతే ఉత్సాహంగా అతడు / ఆమె దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు.
6. దేవుని పట్ల విపరీతమైన ప్రేమ ఒక రకమైన భయాన్ని సృష్టిస్తుంది. ఒక విశ్వాసి దేవునికి అవిధేయతకు భయపడి పాపాలకు దూరంగా ఉండాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే - తార్కికం, ప్రేమ మరియు విధేయత పై ఆధారపడిన విశ్వాసాన్ని ఖుర్ఆన్ ఆదేశిస్తుంది.
************

Comments