ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు? ముస్లిమేతరుల ప్రశ్నలు

ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు?  ముస్లిమేతరుల ప్రశ్నలు


1.  ప్రవక్త ఇబ్రహీం అ.స. వారు అల్లాహ్ ప్రసన్నత కోసం తన కొడుకును బలి ఇచ్చినప్పుడు, ముస్లింలు ఈదుల్ అజహ రోజు జంతు బలి ఎందుకు ఇస్తారు?

వాస్తవానికి ప్రవక్త ఇబ్రహీం అ.స. వారు ఏదైతే కలలో చూసారో దానిని నెరవేర్చడానికి పూర్తి స్పృహతో తన కొడుకును బలి ఇవ్వడానికి బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన తన కొడుకు గొంతుపై కత్తిని ఉంచినప్పటికీ, ఆయన బలి ఇచ్చింది ఒక జంతువును. అల్లాహ్ ఇబ్రహీం అ.స. వారిని పరీక్షిస్తున్నాడు. ఆ పరిక్ష ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం అతను తన అత్యంత విలువైన అనుబంధాన్ని, తన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేస్తాడా? లేదా?? అని. తన కొడుకును బలి ఇవ్వాలన్న ఉద్దేశాన్ని ఇబ్రహీం అ.స. వారు మానుకోలేదు, మరియు ఆయన చివరి వరకు తదనుగుణంగా వ్యవహరించారు. కాబట్టి దేవుడు ఇబ్రహీం అ.స. వారి కార్యాని స్వికరించి, అతని కుమారుడి స్థానాన్ని ఒక జంతువుతో భర్తీ చేశాడు. ఈ సంఘటనను స్మరించడానికి, ఆ రోజున జంతువులను బలి ఇవ్వమని మరియు మాంసాన్ని కుటుంబంలో, స్నేహితులతో, బంధువులతో మరియు పేదలతో పంచుకోవాలని దేవుడు విశ్వాసులందరికీ ఆజ్ఞాపించాడు.

2. పవిత్ర ఖురాన్ ప్రకారం తమ మాంసం లేదా రక్తం దేవునికి చేరదని తెలిసినప్పుడు ముస్లింలు జంతువులను ఎందుకు బలి ఇస్తారు? జంతువులను బలి చేయడానికి ఉపయోగించే డబ్బును ముస్లింలు పేదలకు ఎందుకు ఇవ్వరు?

لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلاَ دِمَآؤُهَا وَلَـكِن

అల్లాహ్‌కు చేరేది వారి మాంసం లేదా వారి రక్తం కాదు, కానీ మీ నుండి వచ్చిన తఖ్వా ఆయనను చేరుతుంది. (22:37)

మాంసం లేదా రక్తం దేవునికి చేరకపోయినా, విశ్వాసులలో 'తఖ్వా' లేదా దేవుని సానిహిత్యం పెంపొందించడానికి బలి దానం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడని పై ఆయత్ ద్వారా స్పష్టమవుతుంది. 'తఖ్వా' అనే దానికి అనేక కోణాలు ఉన్నాయి. అది కేవలం దాన ధర్మాల ద్వారా మాత్రమే వస్తుంది అని అనుకోకూడదు. 'రోజా' మరియు 'నమాజ్' కూడా 'తఖ్వా' అభివృద్ధికి సహాయపడతాయి. 'తఖ్వా' ఉన్న విశ్వాసి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి వివిధ రకాల శిక్షణలు అవసరం.

'రోజా', 'నమాజ్', 'జకాత్' లేదా 'ఖుర్బానీ', ఇవి అన్ని ఒక్కో విధమైన తఖ్వాను పెంపొందిస్తాయి. ఎలాగంటే అన్నపానియాలపై కోరికలను ఎలా నిగ్రహించుకోవాలి. సమయాన్ని ఎలా విలువైనదిగా భావించాలి, క్రమశిక్షణతో ఎలా జీవించాలి, డబ్బు పై మోజును వదిలి ఇతరులకు ఎలా ఇవ్వాలి అనే విషయాలు పై ఆరాధన విధానాలు మనకు నేర్పిస్తాయి.

 'ఖుర్బానీ' విషయంలో, విశ్వాసులను ఇబ్రహీం అ.స. దేవుని ప్రసన్నత కోసం చేసిన గొప్ప త్యాగం గురించి ఆలోచించమని చెప్పబడుతుంది. దైవ ప్రసన్నత కోసం ఇబ్రహీం అ.స. తన కొడుకును బలి  చేయడానికి సిద్దపడిన కార్యానికి అల్లాహ్ అమితంగా ఇష్టపడి భావి తరాలలో విశ్వాసులు అందరు తమ కుమారులకు బదులుగా ఒక జంతువును బలి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. ఏదేమైనా, ఇబ్రహీం అ.స. చేయదలచిన ఈ గొప్ప త్యాగం మరియు దేవుని పట్ల ఆయనకు ఉన్న  నిస్వార్థ ప్రేమ మరియు భక్తి,  ప్రతి నిజమైన విశ్వాసి హృదయంలో జనించాల్సిన అవసరం ఉంది. ఆ సంఘటన జ్ఞాపకార్థంగా దేవుడు ఆజ్ఞాపించిన ఒక జంతు బలి, దేవుని మార్గంలో మనకు ఇష్టమైన ప్రాపంచిక వస్తువులను త్యాగం చేసే ఉత్సాహన్ని బలోపేతం చేస్తుంది. అలాగే, ఇది తన బానిసలపై దేవునికి ఉన్న అనంతమైన దయను గుర్తుచేస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక జంతువును మాత్రమే బలి ఇవ్వమని అడిగి, మనకు ప్రసాదించిన దానిని ఇతరులతో, ముఖ్యంగా పేదలతో పంచుకోవాలని అజ్ఞాపిస్తునాడు.

దాన ధర్మాలకు సంబంధించి, విశ్వాసులకు వారి సంపదపై కనీసం 2.5% తప్పనిసరిగా దానం చేయమని ఆదేశించే ఏకైక ధర్మం ఇస్లాం మాత్రమే. అంతేకాకుండా, స్వచ్ఛంద దానం చేయమని లేదా అవసరమైనవారికి  ఏ విధంగానైనా సహాయం చేయమని ప్రోత్సహిస్తుంది. ఏదేమైనా, దానధర్మాలు తోటి మానవుల పట్ల  మానవులలో నిస్వార్థ స్వభావాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రవక్త ఇబ్రహీం అ.స. వారి  త్యాగాన్ని స్మరిస్తూ చేసిన బలి మన సృష్టికర్త అయిన దేవుని పట్ల భక్తి మరియు నిస్వార్థతను పెంపొందించడానికి సహాయపడుతుంది. అందువల్ల, 'తఖ్వా' పెపొందించడానికి ప్రతి ఒక్క ఆరాధన విధానం కూడా అవసరమే కాబట్టి ఒక విధమైన ఆరాధనను మరొక ఆరాధన ద్వారా భర్తీ చేయలేము.

 

గమనిక: మానవుడికి మాంసం తినడానికి అనుమతి ఉందా లేదా అనేది ఈ వ్యాసం యొక్క పరిధికి మించినది. ఆ అంశాన్ని అర్థం చేసుకోవడానికి దయచేసి దిగువ వీడియోను చూడండి.

 

వివరాల కోసం దయచేసి ఈ వీడియో చూడండి: మాంసాహారం మానవాళికి అనుమతించబడిందా?


Comments