దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు - పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య

 దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు 

- పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య

[హిందూ ధర్మ గొప్ప పండితులు మరియు గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు]


పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య [1990 లో మరణించారు] వేదాలు మరియు హిందూ ధార్మిక గ్రంథాల యొక్క గొప్ప సనాతన-ధర్మ పండితులలో ఒకరు. ఆయన లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న గాయత్రి పరివార్ - హరిద్వార్ ఆధారిత మత సంస్థ / శాఖ స్థాపకులు. అఖండ్-జ్యోతి పత్రిక [గాయత్రి పరివార్ యొక్క అధికారిక పత్రిక] నుండి ఆయన రచన క్రింద ఉంది; జూన్ 1985 ఎడిషన్.


హిందీ కొరకు: https://khurshidimam.blogspot.com/2016/08/blog-post.html


ఈ విశ్వాన్ని సృష్టించినవాడు కేవలం ఒక్కడే. ఆయనే తన ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి, వృద్ధి మరియు పరివర్తన యొక్క అన్ని ప్రక్రియలను నిర్వహిస్తాడు. ఆయనకు  భాగస్వామి గాని సహాయకుడు గాని లేడు.


దేవుని విషయంలో అందరు ఒకే విధమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఏకైక దేవుడి రాజ్యం అనేక మంది దేవుళ్ళ మధ్యలో విభజించబడింది మరియు ప్రజలు తమ ఇష్ట దైవాలను ఆరాధించి మరియు వాటికి మాత్రమే మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.  ఇంతటితో ఆగకుండా, ఇతర వర్గాలను (ఇతర దైవాలను ఆరాధించే వారిని) వ్యతిరేకించడం మరియు వారికి  హాని చేయడం మొదలుపెట్టారు. ఇది నేటి బహుదైవారాధన (పాలిథిజం) పరిస్థితి. ఈ విధంగా, కేవలం ఏకైక దేవుడు అనేక దైవాలుగా విభజించటమే కాక, ప్రతి వంశానికి , ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఒక ప్రత్యేక దేవుడు లేక దేవతను చేసుకున్నారు.  


ఒక దేవుడు అనేక మంది దేవుళ్ళుగా మరియు దేవతలుగా విభజించబడ్డాడు. ఈ దేవుళ్ళు మరియు దేవతలకు వివిధ ఆకృతులను ఇవ్వటమే కాకుండా వాటికి విభిన్న స్వభావం ఇచ్చారు; మరియు వారిని ఆరాధించకుండా, ఇతరులను ఆరాధించే వారిపై వారు కోపంగా ఉన్నట్లు దేవతలను చిత్రీకరించారు. ఈ దేవతలు తమను ఆరాధించని వారికి కష్టాలు ఇస్తున్నట్టు నమ్మకాన్ని కలిగించారు.


బహుదైవారాధన యొక్క ప్రారంభ రోజులలో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మరియు వారి భార్యలు - సరస్వతి, లక్ష్మి మరియు కాళి అనే ముగ్గురు దేవుళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత, నిత్యం కొత్త దేవతలు ఉనికిలోకి రావడం ప్రారంభమయింది. దేవతల సంఖ్య లెక్కించదగనంత ఎక్కువైంది. వారికి విభిన్న మరియు అద్భుతమైన కోరికలు కూడా కల్పించబడ్డాయి. వారిలో కొందరు శాఖాహారులు మరియు కొందరు మాంసాహారులు, కొందరు కోపంగా మరియు కొందరు శాంత మనస్తత్వం గలవారు. కొన్నిసార్లు దెయ్యాలు మరియు పూర్వీకులు కూడా దేవతలుగా మారారు. మరియు వారి సంఖ్య వేలు మరియు లక్షలకు పెరిగింది. ఈ విషయంలో, వెనుకబడిన వర్గాలు దేవతలను గొప్ప ఉత్సాహంతో చేశాయి. ఈ దేవతల కోపం వల్ల శారీరక, మానసిక వ్యాధులు వస్తాయని నమ్ముతారు. అలాంటి అన్ని వ్యాధుల చికిత్స కొంతమంది మధ్యవర్తులు ‘ఓజా’ [మత వైద్యులు] మరియు అతనికి ఇచ్చే లంచం రుసుము అనుకున్నారు. చాలా తరచుగా, ఈ చికిత్సలో, ఆహార పదార్థాలు ఉపయోగించబడ్డాయి. ముఖ్యంగా జంతువులు, పక్షుల బలి జరిగింది. ఇలాంటివి [బలి ఇచ్చిన జంతువులు మరియు పక్షులు] సమర్పణగా ఉపయోగించబడ్డాయి [‘చాడావా’].


కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు లేదా క్రొత్త శిశువు జన్మించినప్పుడల్లా, ‘కుల దేవత’ ను సందర్శించడం అవసరమని భావించారు (ఆ కుటుంబానికి ప్రత్యేకమైన దేవత). ఈ విధంగా, సంబంధిత కుల దేవతను ప్రసన్నత చేసుకోవడం అవసరం అయింది. ఈ అంశం నిమ్న కులాలుగా పరిగణించబడే  సమూహాలు / తెగల యొక్క ముఖ్యమైన లక్షణం. సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందిన దేవతలను వారితో పోల్చుకుంటే మరింత ప్రతిష్టాత్మకంగా మరియు గౌరవప్రదంగా ఉంచారు. ఈ ఉన్నత దేవతలను ఆరాధించడంలో తమ ప్రతిష్ట ఉందని ధనవంతులు భావించారు. పండితులు, పురోహితులు [మతపరమైన అధికారులు] ఈ ఉన్నత దేవతలను ఆరాధించడానికి సంబంధించిన ఆచారాలు చేస్తారు. దుర్గా పూజ, శివ మహిమా, రుద్రి, జాతరలు మొదలైన వ్రతాలు, హవాన్, పూజా [ఆరాధన సంబంధిత ఆచారాలు] కనుగొనబడ్డాయి. బహుదైవారాధనతో అనేక కథలు మరియు ఇతిహాసాలు జతచేయబడ్డాయి. ఈ దేవుళ్ళను ఆరాధించడం వల్ల ప్రయోజనం మరియు ఈ దేవతల కోపం [వారు ఆరాధించకపోతే] ప్రజలు అర్థం చేసుకోవడానికి అనేక కథలు కల్పించబడ్డాయి. పండుగలకు అనేక మంది దేవతలు జతచేయబడ్డారు. ఈ దేవతల ప్రదేశాలను సందర్శించడం తప్పనిసరి చేయబడింది. ఈ పాత దేవతలలో కొన్ని ఈనాటికి ఉన్నాయి మరియు అనేక కొత్త దేవతలు  ఉనికిలోకి వచ్చాయి. అనేక పాత దేవతలను మరచిపోయారు మరియు అనేక కొత్తవి ఉనికిలోకి వచ్చి ప్రసిద్ధి చెందాయి.


తర్కం, హేతుబద్ధత మరియు తెలివి ఆధారంగా, దేవుడు ఒక్కడే అని అంగీకరించడం అనివార్యం. ఆయన ఉనికి మరియు ఆయన గుణాలు మరియు ఆయన చట్టాలు వేర్వేరు వర్గాల / సంప్రాదాయాల కోరికల ప్రకారం ఉండవు. వారి స్వంత నమ్మకాలు వారి వ్యక్తిగత విషయాలు మాత్రమే.


సర్వశక్తిమంతుడి శక్తి నిరాకారంగా ఉండాలి (నిరాకారుడు). ఏదో ఒక రూపం ఉన్నవాడు ఏదో ఒక దేశానికి, ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతాడు. మరియు వేదాలలో  ‘न तस्य प्रतिमा अस्ति (న తస్య ప్రతిమా అస్తి- యజుర్వేదం 32: 3] అనగా ఆయనకు విగ్రహం / ఆకారం / రూపం లేదు అని చెప్పబడింది. ఇంకా  ‘एकं सद्विप्रा वहुधा वदन्ति’ (ఏకం సద్విప్ర బహుధ వదాంతి ఋగ్వేదం 1: 164: 46) అంటే పండితులు ఒకే దేవుడిని అనేక పేర్లతో పిలిచారు అని చెప్పడం జరిగింది. అంతిమంగా -  తెలివైన నిర్ణయం మరియు మీకు ఇచ్చే ఉపదేశం ఏమిటంటే విశ్వవ్యవహారాలు మరియు ఈ సృష్టిలో సంబంధం కలిగి ఉన్నట్లుగా భావించే తప్పుడు దేవుళ్ళ నుండి మీరంతా తప్పుకోవాలి. 

---- పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య, అఖండ్ జ్యోతి, జూన్ 1985

*********************

మూలం: క్రింది కంటెంట్ యొక్క హిందీ నుండి ఆంగ్ల అనువాదం

 http://literature.awgp.org/magazine/AkhandjyotiHindi/1985/June.14 

http://literature.awgp.org/magazine/AkhandjyotiHindi/1985/June.15

http://literature.awgp.org/magazine/AkhandjyotiHindi/1985/June.17

**********************

Comments