నేను సైన్స్ లో నమ్ముతాను. నాకు మతం లేదా దేవూడి అవసరం ఎందుకు?

నేను సైన్స్ లో నమ్ముతాను. నాకు మతం లేదా దేవూడి అవసరం ఎందుకు? 

********************


సైన్స్, దేవుని చట్టాల ఆవిష్కరణ గురించి వ్యవహరిస్తోంది. ప్రకృతి చట్టాలు, సమనమైన నియమల పై మార్చేలేనివి.  మనం ఎంత ఈ చట్టాల పై ఆలోచిస్తే అన్ని మంచి విషయాలు మానవజాతికి ఇవ్వగలం.

మన రోజువారీ జీవితంలో సైన్స్ మనకు ఎంతో సహాయపడుతుంది. మన అలారం గడియారం నుండి ఆరోగ్య మందుల వరకు అన్ని సైన్స్ కి సంబంధించినవే.

అదే సమయంలో, సైన్స్ దాని సొంత పరిమితులను కలిగి ఉంది. జీవితంలోని ప్రతి అంశంలోనూ సైన్స్ మనకు మార్గనిర్దేశం చేస్తుందని ఆశించడం తీవ్ర అన్యాయం అవుతుంది.

సైన్స్ యొక్క స్వభావం మనల్ని మానసికంగా మరియు భావోద్వేముగా మంచి మానవుడిగా చేయలేదు. ఉదాహరణకు, నైతిక విలువలు, నీతి లేదా సామాజిక ప్రవర్తన గురించి సైన్స్ మాట్లాడదు. ఇది, తల్లిదండ్రులను గారవించాలి, జీవిత భాగస్వామిని ప్రేమించాలి, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదా పేదలకు సహాయం చెయ్యాలి అన్న విషయాల గురించి మాట్లాడదు.

అదేవిధంగా, సైన్స్ ఒకరి మనస్సాక్షికి విజ్ఞప్తి చేయదు మరియు ఒకర్ని మరొకరికి హాని చేయకుండా ఆపదు.

అత్యంత ఆధునిక సైన్స్ ల్యాబ్ లలో, 'పని వద్ద లైంగిక వేధింపులకు నివారణ' అని హెచ్ ఆర్ పాలసీ ఉంటుంది. అయినప్పటికీ, నైతికంగా సరైన లైంగిక ప్రవర్తన ఏమిటో సైన్స్ మనకు నేర్పించలేదు!

మన రోజువారీ జీవితంలో సైన్స్ చాలా అవసరం అయినప్పటికీ, ఇది మన ఉనికి యొక్క పెద్ద దృష్టికోణాన్ని పట్టించుకోలేదు:

1. మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి?

2. ఏ చర్యలు ప్రయోజనకరమైనవి మరియు హానికరమైనవి?

3. పేదరికం, ఔషధ-వ్యసనం, అత్యాచారం, దోపిడీ, హత్య మొదలైనవి వదిలించుకోవడానికి ఏ చట్టాలు అమలు అవ్వాలి?

4. జీవితం మరియు సమాజంలో 'శాంతి' ఎలా సాధించాలి?

సైన్స్ ఈ సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వదు.

కాబట్టి, మన జ్ఞానం ఆధారంగా సైన్స్ కంటే పెద్ద డొమైన్‌ను కవర్ చేసే ఒక పరిధి మనకు అవసరం. అది ఏమిటంటే 'సర్వశక్తిమంతుడైన దేవుని మార్గదర్శకత్వం'.

ఎవరైతే మానవాళిని సృష్టించారో, ఎవరికైతే ఏది ఉత్తమమో తెలుసో, ఎవరికైతే మానవాళికి ఏది మంచో మరియు ఏది చెడో తెలుసో, ఎవరైతే నిష్పాక్షికంగా ఉంటారో ఆయన నుండి మనకు మార్గదర్శకత్వం అవసరం.

దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించడాన్నే దేవుని మతం అంటారు.

మరియు ఈ మార్గదర్శకత్వం మనల్ని, భగవంతుడు సృష్టించిన చట్టాలు మరియు విషయాలపై జాగ్రత్తగా ఆలోచించాలి అని మరియు వాటిని మన కోసం మరియు సామాజిక శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి అని చెబుతుంది.

Comments