భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడలేదా?

భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడలేదా?
***********************************

విశ్వం యొక్క సృష్టి గురించి లోతుగా లేదా జాగ్రత్తగా ఎవరైతే ఆలోచిస్తారో, వారు, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని అంగీకరిస్తారు.
మన చుట్టూ ఉన్న ప్రతిదీ సర్వోన్నత శక్తికి రుజువు.
ఈ ఉద్దేశ్యాన్ని పూర్తిచేయడానికి సృష్టికర్త లేదా దేవుడు మానవాళికి మార్గదర్శకత్వం పంపించి ఉండాలి.  ఇప్పుడు, దేవుడు ఒక్కడే కాబట్టి, మానవత్వం ఒక్కటే, కనుక ఈ భూమిపై మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం మరియు దేవుని మార్గదర్శకత్వం ఒక్కటై ఉండాలి.

దేవుడు తన మార్గదర్శకత్వంతో దూతలను, ప్రవక్తలను అన్ని సమయాల్లో మరియు అన్ని ప్రదేశాలలో పంపాడు. దేవుని నుండి వచ్చిన చివరి మార్గదర్శక గ్రంథం ఖురాన్, స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, ఈ భూమిపైకి మొట్టమొదటి మనిషి  వచ్చినప్పటి నుండి దేవుని మార్గదర్శకత్వం ఒకే విధంగా ఉంది.

ముహమ్మద్ ప్రవక్తతో సహా ప్రవక్తలందరూ సర్వశక్తిమంతుడైన దేవుడి నుండి వచ్చిన మార్గదర్శకత్వాన్ని ప్రజలకు అందించారు (ఖురాన్ 42:13).

ప్రతి సమాజానికి లేదా దేశానికి ప్రవక్తలు మరియు దూతలు (వార్తాహరులు) పంపబడ్డారని ఖురాన్ తెలియచేస్తుంది.  ఖురాన్, వీరిలో 25 పేర్లను మాత్రమే ప్రస్తావించింది.  ఇది మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం మరియు చరిత్ర యొక్క స్థూలమైన పుస్తకానికి తగ్గించడం కాదు. ఖురాన్లో ప్రస్తావించబడిన చాలా మంది ప్రవక్తలు అరబ్ మరియు దాని పరిసరాలలోని వివిధ ప్రాంతాలలో వచ్చారు.  ఖురాన్ యొక్క ఈ ప్రస్తావన తరచూ మన హిందూ సోదరులను, ఇది నిజమైతే, వారికి పంపిన ప్రవక్త ఎవరు అని ఆలోచింపజేస్తుంది?  వారికి తమ పండితుల నుండి లేదా ఇస్లామిక్ పండితుల నుండి కూడా స్పష్టమైన సమాధానం దొరకనందున,  మరొక కొత్త ప్రశ్న తలెత్తుతుంది - ఇంత పెద్ద జనాభాకు ఏ ప్రవక్తను పంపకుండ దేవుడు వివక్ష చూపుతున్నాడా?

ప్రపంచ జనాభా చూసినట్టు అయితే 17% గణనీయమైన భాగం భారతదేశం యొక్క హిందూ సంఘాలది ఉంటుంది. హిందూ మతం ప్రపంచంలోని పురాతన ఆస్తిక మతాలలో ఒకటి. దీని పవిత్ర పుస్తకం వేదాలు.  హిందువులలో ఎక్కువమంది పవిత్రంగా భావించే ఇతర మత గ్రంథాలు అన్నీ మానవులచే వ్రాయబడ్డాయి.  ఏది ఏమయినప్పటికీ, దైవ ద్యోతకం ఇచ్చిన ప్రవక్తతో సంబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్క ఇతర ప్రధాన ఆస్తిక మతాల మాదిరిగా తమ వేదాలు ఏ ప్రవక్తతోను సంబంధం కలిగి ఉండవని హిందువులు భావిస్తారు. హిందువులు వేదాలను దైవ మార్గదర్శకంగా భావిస్తే, ఈ మార్గదర్శకత్వం ఎవరికి వచ్చిందో వారు ప్రవక్త కాదా?

భారతీయ ఉపఖండానికి దేవుని మార్గదర్శకత్వాన్ని తీసుకువచ్చిన కనీసం ఒక ప్రవక్త అయినా ఉండాలన్న లాజికల్ నిర్ణయానికి ఇది మమ్మల్ని దారి తీస్తుంది.  అన్ని ఆస్తిక సమాజాలకు వారి ప్రవక్తలు ఉన్నట్లే, హిందువులకు దేవుని మార్గదర్శకత్వం తెచ్చిన వారి ప్రవక్త కూడా ఉండాలి.

ఏది ఏమఅయినప్పటికీ, వారు తమ ప్రవక్తను పురాణాలలో కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఖురాన్ మరియు హిందూ సంప్రదాయాలు ఈ విషయంపై ఏమైనా తెలియచేస్తున్నాయా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు? ముస్లిమేతరుల ప్రశ్నలు

సత్యం వెలుగులో: హిందూ ధార్మిక గ్రంథాల ఫార్సీ మరియు ఉర్దూ అనువాదాలు

మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా?