Posts

ప్రవక్త యూనస్ (అ.స.) కథ నుండి 4 పాఠాలు

Image
  ప్రవక్త యూనస్ (అ.స.) కథ నుండి 4 పాఠాలు 1. మీ చేసిన పాపాన్ని గుర్తించండి  మరియు క్షమాపణ కోరండి చేప సముద్రంలోకి వచ్చినప్పుడు  ప్రవక్త యూనస్ (అ.స.) తన పొరపాటును గ్రహించి, ఆయన చేప కడుపులోనే సాష్టాగంలో పడిపోయారు, మరియు అల్లాహ్ నుండి పాప క్షమాపణ కోరారు  2. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి  అతను తన దురదృష్టం గురించి విలపించలేదు  జీవితాన్ని వదులుకోలేదు. బదులుగా,  దేవుని వైపు అతను చేతులు ఎత్తారు. “అప్పుడు మేము స్పందించి, అతనికి ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము.  మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము." (ఖురాన్ 21:88) 3. సందేశ ప్రచారంలో సహనం వహించాలి మీ కృషి ఫలించటానికి కొంత సమయం పటవచ్చు. మీరు ఎన్నో సంవత్సరాలుగా తెలియచేస్తునప్పటికి  మీ స్నేహితులు లేదా కుటుంబం వారు సత్యాన్ని అంగీకరించకపోవచ్చు. దీని అర్థం మీరు సందేశ ప్రచారం ఆపాలి అని కాదు.   4. జిక్ర్ [అల్లాహ్ స్మరణ] మరియు దువా [ప్రార్ధన] శక్తివంతమైన సాధనాలు సముద్ర ప్రాణులు కూడా దైవాన్ని స్తుతిస్తున్నాయి అని ప్రవక్త యూనుస్ (అ.స.) గ్రహించారు. దువా మరియు జిక్ర్  యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఇది ఒక జ్ఞాపిక.   మీరు దేవున

దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు - పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య

Image
 దేవుడు ఒక్కడే... ఆయన ఆద్వితీయుడు  - పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య [హిందూ ధర్మ గొప్ప పండితులు మరియు గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు] పండిట్ శ్రీ రామ్ శర్మ ఆచార్య [1990 లో మరణించారు] వేదాలు మరియు హిందూ ధార్మిక గ్రంథాల యొక్క గొప్ప సనాతన-ధర్మ పండితులలో ఒకరు. ఆయన లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న గాయత్రి పరివార్ - హరిద్వార్ ఆధారిత మత సంస్థ / శాఖ స్థాపకులు. అఖండ్-జ్యోతి పత్రిక [గాయత్రి పరివార్ యొక్క అధికారిక పత్రిక] నుండి ఆయన రచన క్రింద ఉంది; జూన్ 1985 ఎడిషన్. హిందీ కొరకు: https://khurshidimam.blogspot.com/2016/08/blog-post.html ఈ విశ్వాన్ని సృష్టించినవాడు కేవలం ఒక్కడే. ఆయనే తన ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి, వృద్ధి మరియు పరివర్తన యొక్క అన్ని ప్రక్రియలను నిర్వహిస్తాడు. ఆయనకు  భాగస్వామి గాని సహాయకుడు గాని లేడు. దేవుని విషయంలో అందరు ఒకే విధమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఏకైక దేవుడి రాజ్యం అనేక మంది దేవుళ్ళ మధ్యలో విభజించబడింది మరియు ప్రజలు తమ ఇష్ట దైవాలను ఆరాధించి మరియు వాటికి మాత్రమే మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.  ఇంతటితో ఆగకుండా, ఇతర వర్గాలను (ఇతర దైవాలను ఆరాధించే వారిని) వ్యతిరేకించడం మరియు వారికి 

ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు? ముస్లిమేతరుల ప్రశ్నలు

ఈదుల్ అజహ రోజు ముస్లింలు జంతు బలి ఎందుకు ఇస్తారు?   ముస్లిమేతరుల ప్రశ్నలు 1.   ప్రవక్త ఇబ్రహీం అ.స. వారు అల్లాహ్ ప్రసన్నత కోసం తన కొడుకును బలి ఇచ్చినప్పుడు , ముస్లింలు ఈదుల్ అజహ రోజు జంతు బలి ఎందుకు ఇస్తారు ? వాస్తవానికి ప్రవక్త ఇబ్రహీం అ.స. వారు ఏదైతే కలలో చూసారో దానిని నెరవేర్చడానికి పూర్తి స్పృహతో తన కొడుకును బలి ఇవ్వడానికి బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన తన కొడుకు గొంతుపై కత్తిని ఉంచినప్పటికీ , ఆయన బలి ఇచ్చింది ఒక జంతువును. అల్లాహ్ ఇబ్రహీం అ.స. వారిని పరీక్షిస్తున్నాడు. ఆ పరిక్ష ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం అతను తన అత్యంత విలువైన అనుబంధాన్ని, తన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేస్తాడా? లేదా?? అని. తన కొడుకును బలి ఇవ్వాలన్న ఉద్దేశాన్ని ఇబ్రహీం అ.స. వారు మానుకోలేదు, మరియు ఆయన చివరి వరకు తదనుగుణంగా వ్యవహరించారు. కాబట్టి దేవుడు ఇబ్రహీం అ.స. వారి కార్యాని స్వికరించి, అతని కుమారుడి స్థానాన్ని ఒక జంతువుతో భర్తీ చేశాడు. ఈ సంఘటనను స్మరించడానికి, ఆ రోజున జంతువులను బలి ఇవ్వమని మరియు మాంసాన్ని కుటుంబంలో , స్నేహితులతో, బంధువులతో మరియు పేదలతో పంచుకోవాలని దేవుడు విశ్వాసులందరికీ ఆజ్ఞాపించా

మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా?

మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా? ప్రశ్న: మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా లేక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలా? దేవునికి విధేయత చూపటంలో మొదటి అడుగు భయభక్తులు అని నేను నమ్ముతున్నాను. *************** జవాబు: "తఖ్వా" అనే అరబిక్ పదానికి సాధారణంగా "భయం" అని తప్పుగా అనువదించబడుతుంది. "తఖ్వా" అనే పదానికి ధాతువులు "వావ్ కాఫ్ యా" ప్రేమను సూచిస్తాయి. జంతువు, దెయ్యం లేదా చెడ్డ వ్యక్తులకు మనం భయపడుతున్నట్లు దేవునికి భయపడకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. ఒకరి పట్ల ప్రేమ పరాకాష్టకు చేరుకున్నప్పుడు భయం కలుగుతుంది. కానీ ఈ భయం విపరీతమైన ప్రేమ వలనే కాని భయానక విషయాల వల్ల కాదు. ఈ భయం మీరు ప్రేమించేవారికి అవిధేయత చూపకుండా నిరోధిస్తుంది. ఇలాంటి ప్రేమ / భయం భావననే “తఖ్వా” అంటారు. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఈ విధంగా తెలియజేస్తుంది. "... విశ్వాసులైన వారు అల్లాహ్ ను అత్యధికంగా ప్రేమిస్తారు..." ఖుర్ఆన్ 2: 165 అంతే కాకుండా విశ్వాసులు అల్లాహ్‌ను ఎక్కువగా స్మరిస్తారు అని ఖుర్ఆన్ చెబుతుంది. అదే సమయంలో ఖుర్ఆన్ విశ్వాసులకు ‘తఖ్వ’ కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తుంది,

మరణాంతర జీవితం లేనిదీ మానవత్వం ఉంటుందా?

మరణాంతర జీవితం లేనిదీ మానవత్వం ఉంటుందా? 'నిజానికి, నేను మానవత్వాన్ని నమ్ముతాను మతాన్ని కాదు' ********************* A) మానవత్వం - పరలోకంలో నమ్మకం లేకుండా [పార్లోక్]? 'నేను మానవత్వం యొక్క మతాన్ని నమ్ముతున్నాను'. ముందు మంచి మనిషిగా మారి ఆ తర్వాత మంచి ........ మారాలి. 'స్వర్గాన్ని / నరకాన్ని ఎవరు చూశారు?  కాబట్టి ఎందుకు దీన్ని నమ్మాలి?' తరచుగా, పార్లోక్ / విశ్వాసం / భగవంతుడిపై ఉపన్యాసం ఉన్నప్పుడల్లా మనం ఇలాంటి మాటలను వింటూ ఉంటాము. అలాంటి ప్రకటనలు చేసేవారికి బహుశా దేవుడు మరియు పరలోకం యొక్క నిజమైన భావన తెలిసిఉండదు.  ఏదైనా సహజమైన లేదా మనిషి తాయారు చేసిన వస్తువును దేవుడిగా చేసినప్పుడు, తార్కిక లేదా హేతుబద్ధమైన వ్యక్తి ఈ రకమైన నమ్మకం / భావనను అంగీకరించలేడు. "నేను మానవత్వాన్ని నమ్ముతున్నాను."  మానవత్వం అంటే ఏమిటి? మానవత్వ మరియు అమానవీయం ఏమిటి అని ఎవరు నిర్ణయిస్తారు? నైతికత లేదా అనైతికత యొక్క పారామితులను ఎవరు నిర్ణయిస్తారు? ఒక దోపిడీదారుడు ఇతరుల విలువైన వస్తువులను దోచుకొని తనకు మరియు అతని కుటుంబానికి చట్టబద్ధమైన సంపాదనను సంపాదిస్తున్నా

నేను సైన్స్ లో నమ్ముతాను. నాకు మతం లేదా దేవూడి అవసరం ఎందుకు?

నేను సైన్స్ లో నమ్ముతాను. నాకు మతం లేదా దేవూడి అవసరం ఎందుకు?  ******************** సైన్స్, దేవుని చట్టాల ఆవిష్కరణ గురించి వ్యవహరిస్తోంది. ప్రకృతి చట్టాలు, సమనమైన నియమల పై మార్చేలేనివి.  మనం ఎంత ఈ చట్టాల పై ఆలోచిస్తే అన్ని మంచి విషయాలు మానవజాతికి ఇవ్వగలం. మన రోజువారీ జీవితంలో సైన్స్ మనకు ఎంతో సహాయపడుతుంది. మన అలారం గడియారం నుండి ఆరోగ్య మందుల వరకు అన్ని సైన్స్ కి సంబంధించినవే. అదే సమయంలో, సైన్స్ దాని సొంత పరిమితులను కలిగి ఉంది. జీవితంలోని ప్రతి అంశంలోనూ సైన్స్ మనకు మార్గనిర్దేశం చేస్తుందని ఆశించడం తీవ్ర అన్యాయం అవుతుంది. సైన్స్ యొక్క స్వభావం మనల్ని మానసికంగా మరియు భావోద్వేముగా మంచి మానవుడిగా చేయలేదు. ఉదాహరణకు, నైతిక విలువలు, నీతి లేదా సామాజిక ప్రవర్తన గురించి సైన్స్ మాట్లాడదు. ఇది, తల్లిదండ్రులను గారవించాలి, జీవిత భాగస్వామిని ప్రేమించాలి, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదా పేదలకు సహాయం చెయ్యాలి అన్న విషయాల గురించి మాట్లాడదు. అదేవిధంగా, సైన్స్ ఒకరి మనస్సాక్షికి విజ్ఞప్తి చేయదు మరియు ఒకర్ని మరొకరికి హాని చేయకుండా ఆపదు. అత్యంత ఆధునిక సైన్స్ ల్యాబ్ లలో, 'పని వద్ద

సూర్యుడు మరియు చంద్రుడు ప్రయోజనకరంగా ఉన్నందున మనం వాటిని ఆరాధించగలమా?

సూర్యుడు మరియు చంద్రుడు ప్రయోజనకరంగా ఉన్నందున మనం వాటిని ఆరాధించగలమా? ************** విభిన్న పరిస్థితులకు, ప్రవర్తన యొక్క విభిన్న పదాలు మరియు రకాలు ఉన్నాయి. గౌరవం, ప్రేమ, ఆప్యాయత, సమర్పణ, ప్రశంసలు, మెప్పు - ఇవన్నీ మనం వేర్వేరు పరిస్థితులలో ఉపయోగించే వేర్వేరు పదాలు. మీరు తల్లిదండ్రులను గౌరవిస్తారు మరియు ప్రేమిస్తారు. మీరు ఒక క్రికెటర్ లేదా ఒకరి ధైర్య చర్యను ప్రశంసిస్తారు. కానీ, వారు మీ తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేయలేరు.  మీరు, మీ తల్లిదండ్రులను ప్రేమించే విధంగా వారిని ప్రేమించలేరు. మీరు మీ జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు, కానీ మీరు మీ పొరుగువారిని ప్రేమించే విధంగా కాదు. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించండి.  దేవుని మార్గదర్శకత్వం ప్రకారం మీ జీవితమంతా నడవాలి. భగవంతుడిని స్థానాన్ని ఎవ్వరు భర్తీ చేయలేరు. మీరు జంతువుల పట్ల ఆప్యాయత చూపిస్తారు, ఈ ఆప్యాయత మీ పిల్లల పట్ల ఉండే విధంగా ఉండదు. పువ్వులు, పక్షులు, ఆకాశం, మహాసముద్రాలు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు మొదలైన అందాలను మీరు ప్రశంసిస్తారు. ఇవన్నీ మనం దేవుడు అని పిలిచే మాస్టర్ డిజైనర్‌కు రుజువులు. తిరిగే మరియు భ్రమ