పోస్ట్‌లు

మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా?

మనం దేవుణ్ణి ప్రేమించాలా లేక దేవునికి భయపడాలా? ప్రశ్న: మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా లేక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలా? దేవునికి విధేయత చూపటంలో మొదటి అడుగు భయభక్తులు అని నేను నమ్ముతున్నాను. *************** జవాబు: "తఖ్వా" అనే అరబిక్ పదానికి సాధారణంగా "భయం" అని తప్పుగా అనువదించబడుతుంది. "తఖ్వా" అనే పదానికి ధాతువులు "వావ్ కాఫ్ యా" ప్రేమను సూచిస్తాయి. జంతువు, దెయ్యం లేదా చెడ్డ వ్యక్తులకు మనం భయపడుతున్నట్లు దేవునికి భయపడకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. ఒకరి పట్ల ప్రేమ పరాకాష్టకు చేరుకున్నప్పుడు భయం కలుగుతుంది. కానీ ఈ భయం విపరీతమైన ప్రేమ వలనే కాని భయానక విషయాల వల్ల కాదు. ఈ భయం మీరు ప్రేమించేవారికి అవిధేయత చూపకుండా నిరోధిస్తుంది. ఇలాంటి ప్రేమ / భయం భావననే “తఖ్వా” అంటారు. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఈ విధంగా తెలియజేస్తుంది. "... విశ్వాసులైన వారు అల్లాహ్ ను అత్యధికంగా ప్రేమిస్తారు..." ఖుర్ఆన్ 2: 165 అంతే కాకుండా విశ్వాసులు అల్లాహ్‌ను ఎక్కువగా స్మరిస్తారు అని ఖుర్ఆన్ చెబుతుంది. అదే సమయంలో ఖుర్ఆన్ విశ్వాసులకు ‘తఖ్వ’ కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తుంది, ...

మరణాంతర జీవితం లేనిదీ మానవత్వం ఉంటుందా?

మరణాంతర జీవితం లేనిదీ మానవత్వం ఉంటుందా? 'నిజానికి, నేను మానవత్వాన్ని నమ్ముతాను మతాన్ని కాదు' ********************* A) మానవత్వం - పరలోకంలో నమ్మకం లేకుండా [పార్లోక్]? 'నేను మానవత్వం యొక్క మతాన్ని నమ్ముతున్నాను'. ముందు మంచి మనిషిగా మారి ఆ తర్వాత మంచి ........ మారాలి. 'స్వర్గాన్ని / నరకాన్ని ఎవరు చూశారు?  కాబట్టి ఎందుకు దీన్ని నమ్మాలి?' తరచుగా, పార్లోక్ / విశ్వాసం / భగవంతుడిపై ఉపన్యాసం ఉన్నప్పుడల్లా మనం ఇలాంటి మాటలను వింటూ ఉంటాము. అలాంటి ప్రకటనలు చేసేవారికి బహుశా దేవుడు మరియు పరలోకం యొక్క నిజమైన భావన తెలిసిఉండదు.  ఏదైనా సహజమైన లేదా మనిషి తాయారు చేసిన వస్తువును దేవుడిగా చేసినప్పుడు, తార్కిక లేదా హేతుబద్ధమైన వ్యక్తి ఈ రకమైన నమ్మకం / భావనను అంగీకరించలేడు. "నేను మానవత్వాన్ని నమ్ముతున్నాను."  మానవత్వం అంటే ఏమిటి? మానవత్వ మరియు అమానవీయం ఏమిటి అని ఎవరు నిర్ణయిస్తారు? నైతికత లేదా అనైతికత యొక్క పారామితులను ఎవరు నిర్ణయిస్తారు? ఒక దోపిడీదారుడు ఇతరుల విలువైన వస్తువులను దోచుకొని తనకు మరియు అతని కుటుంబానికి చట్టబద్ధమైన సంపాదనను సంపాదిస్తున్నా...

నేను సైన్స్ లో నమ్ముతాను. నాకు మతం లేదా దేవూడి అవసరం ఎందుకు?

నేను సైన్స్ లో నమ్ముతాను. నాకు మతం లేదా దేవూడి అవసరం ఎందుకు?  ******************** సైన్స్, దేవుని చట్టాల ఆవిష్కరణ గురించి వ్యవహరిస్తోంది. ప్రకృతి చట్టాలు, సమనమైన నియమల పై మార్చేలేనివి.  మనం ఎంత ఈ చట్టాల పై ఆలోచిస్తే అన్ని మంచి విషయాలు మానవజాతికి ఇవ్వగలం. మన రోజువారీ జీవితంలో సైన్స్ మనకు ఎంతో సహాయపడుతుంది. మన అలారం గడియారం నుండి ఆరోగ్య మందుల వరకు అన్ని సైన్స్ కి సంబంధించినవే. అదే సమయంలో, సైన్స్ దాని సొంత పరిమితులను కలిగి ఉంది. జీవితంలోని ప్రతి అంశంలోనూ సైన్స్ మనకు మార్గనిర్దేశం చేస్తుందని ఆశించడం తీవ్ర అన్యాయం అవుతుంది. సైన్స్ యొక్క స్వభావం మనల్ని మానసికంగా మరియు భావోద్వేముగా మంచి మానవుడిగా చేయలేదు. ఉదాహరణకు, నైతిక విలువలు, నీతి లేదా సామాజిక ప్రవర్తన గురించి సైన్స్ మాట్లాడదు. ఇది, తల్లిదండ్రులను గారవించాలి, జీవిత భాగస్వామిని ప్రేమించాలి, పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి లేదా పేదలకు సహాయం చెయ్యాలి అన్న విషయాల గురించి మాట్లాడదు. అదేవిధంగా, సైన్స్ ఒకరి మనస్సాక్షికి విజ్ఞప్తి చేయదు మరియు ఒకర్ని మరొకరికి హాని చేయకుండా ఆపదు. అత్యంత ఆధునిక సైన్స్ ల్యాబ్ లలో, 'పని ...

సూర్యుడు మరియు చంద్రుడు ప్రయోజనకరంగా ఉన్నందున మనం వాటిని ఆరాధించగలమా?

సూర్యుడు మరియు చంద్రుడు ప్రయోజనకరంగా ఉన్నందున మనం వాటిని ఆరాధించగలమా? ************** విభిన్న పరిస్థితులకు, ప్రవర్తన యొక్క విభిన్న పదాలు మరియు రకాలు ఉన్నాయి. గౌరవం, ప్రేమ, ఆప్యాయత, సమర్పణ, ప్రశంసలు, మెప్పు - ఇవన్నీ మనం వేర్వేరు పరిస్థితులలో ఉపయోగించే వేర్వేరు పదాలు. మీరు తల్లిదండ్రులను గౌరవిస్తారు మరియు ప్రేమిస్తారు. మీరు ఒక క్రికెటర్ లేదా ఒకరి ధైర్య చర్యను ప్రశంసిస్తారు. కానీ, వారు మీ తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేయలేరు.  మీరు, మీ తల్లిదండ్రులను ప్రేమించే విధంగా వారిని ప్రేమించలేరు. మీరు మీ జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు, కానీ మీరు మీ పొరుగువారిని ప్రేమించే విధంగా కాదు. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించండి.  దేవుని మార్గదర్శకత్వం ప్రకారం మీ జీవితమంతా నడవాలి. భగవంతుడిని స్థానాన్ని ఎవ్వరు భర్తీ చేయలేరు. మీరు జంతువుల పట్ల ఆప్యాయత చూపిస్తారు, ఈ ఆప్యాయత మీ పిల్లల పట్ల ఉండే విధంగా ఉండదు. పువ్వులు, పక్షులు, ఆకాశం, మహాసముద్రాలు, పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు మొదలైన అందాలను మీరు ప్రశంసిస్తారు. ఇవన్నీ మనం దేవుడు అని పిలిచే మాస్టర్ డిజైనర్‌కు రుజువులు. తిరిగే మ...

భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడలేదా?

భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడలేదా? *********************************** విశ్వం యొక్క సృష్టి గురించి లోతుగా లేదా జాగ్రత్తగా ఎవరైతే ఆలోచిస్తారో, వారు, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని అంగీకరిస్తారు. మన చుట్టూ ఉన్న ప్రతిదీ సర్వోన్నత శక్తికి రుజువు. ఈ ఉద్దేశ్యాన్ని పూర్తిచేయడానికి సృష్టికర్త లేదా దేవుడు మానవాళికి మార్గదర్శకత్వం పంపించి ఉండాలి.  ఇప్పుడు, దేవుడు ఒక్కడే కాబట్టి, మానవత్వం ఒక్కటే, కనుక ఈ భూమిపై మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం మరియు దేవుని మార్గదర్శకత్వం ఒక్కటై ఉండాలి. దేవుడు తన మార్గదర్శకత్వంతో దూతలను, ప్రవక్తలను అన్ని సమయాల్లో మరియు అన్ని ప్రదేశాలలో పంపాడు. దేవుని నుండి వచ్చిన చివరి మార్గదర్శక గ్రంథం ఖురాన్, స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, ఈ భూమిపైకి మొట్టమొదటి మనిషి  వచ్చినప్పటి నుండి దేవుని మార్గదర్శకత్వం ఒకే విధంగా ఉంది. ముహమ్మద్ ప్రవక్తతో సహా ప్రవక్తలందరూ సర్వశక్తిమంతుడైన దేవుడి నుండి వచ్చిన మార్గదర్శకత్వాన్ని ప్రజలకు అందించారు (ఖురాన్ 42:13). ప్రతి సమాజానికి లేదా దేశానికి ప్రవక్తలు మరియు దూతలు (వార్తాహరులు) పంపబడ్డారని ఖురాన్ తెలియచేస్తుంది.  ఖురాన్...

ఒకే సృష్టికర్త మానవులను అనేక ధర్మాల వారీగా విభజించాడా?

మనం చూస్తున్న మతాలు అన్నీ ఆ సృష్టికర్త ఆదేశించినవేనా? వీటిలో ఏదో ఒక మతాన్ని మనం అనుసరిస్తే ఆ దైవాన్ని చేరుకోగలమా? మనం దేవుళ్ళు ఎంతమంది అని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఏ మతానికి చెందినవరైనా “దేవుడు ఒక్కడే” అనే సమాధానం ఇస్తారు. ఆ ఒక్క దేవుడే ఈ అనంత విశ్వానికి కర్త మరియు యజమాని. ఆయనే సమస్త ఉనికికి కారణమైన వాడు. కాబట్టి మానవులకు అనేక సృష్టికర్తలు (దేవుళ్ళు) లేరు! అలాకాదని ఇండియాకు ఒక దేవుడు, జపాన్ కోసం వేరే దేవుడు, అమెరికాకు వేరే దేవుడు ఉన్నాడు అని అనటం అలాగే ఇండియాలో ఆంధ్రాకు ప్రత్యేక దేవుడు ఉన్నాడు, కేరళ కోసం వేరే దేవుడు, ఢిల్లీ వారి కోసం వేరే దేవుడు ఉన్నాడు అనటం విచిత్రమైన విషయం అవుతుంది. మరి అదేవిధముగా వర్షం కురిపించటానికి ఒక దైవం, జ్ఞానం ప్రసాదించటానికి మరొక్క దైవం, ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి వేరే దైవం ఉన్నారు అనటం కూడా విచిత్రమైన విషయమే. మన బుద్ది – వివేచనాలను ప్రశ్నిస్తే అవే సమాధానమిస్తాయి అందరికీ సృష్టికర్త (దేవుడు) ఒక్కడే అని, కానీ ఆయనను వివిధ భాషల వారు వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఇలా ఆయనను పిలుచుకునే పేర్లు అనేకమైన దేవుడు మాత్రం అనేకం కాడు అనే విషయం అర్ధంచేసుకోవాలి. ఆ ఒక్...

మొఘల్ _ కారణంగా హిందువులలో పర్దా?

మొఘల్ _ కారణంగా హిందువులలో పర్దా? ***********************************  భారతదేశంలొని మహిళల్లో ఎటువంటి వీల్ (ముఖాన్ని రక్షించడానికి లేదా దాచడానికి మహిళలు ధరించే వస్త్రం) ఆచారం లేదని, ఇది మొఘల్ యొక్క చెడు కళ్ళ నుండి మహిళలను కాపాడటానికి మొఘల్ పాలన కారణంగా ప్రారంభం అయిందని భారతీయ ద్వేషపూరిత ప్రచారాలు చెబుతున్నాయి. ఏదైనా వస్త్రము / బట్టతో తల కప్పుకోవడం మంచిదా కాదా? మేము ఈ విషయాన్ని దీనిని చదివే వారి జ్ఞానానికి వదిలేస్తున్నాము. ఏవైతే ఆరోపణలు మనం వింట ఉంటామో వాటిపై దృష్టి పెడదాము. వేలాది సంవత్సరాలు కలిసి జీవించడం వల్ల హిందువులు, ముస్లింలు ఒకరినొకరు సాంస్కృతికంగా ప్రభావితం చేశారన్నది నిజం.  ఇది చాలా సహజమైనది. శతాబ్దాలుగా హిందూ మహిళలు, తమ మామగారి ముందు, భర్త యొక్క అన్నయ్య ముందు (బావ) మరియు కుటుంబంలోని ఇతర పెద్దల ముందు ముసుగు వేసుకునే వారు / తలను కప్పుకునే వారు (దీనిని ప్రముఖంగా ఘున్‌ఘాట్ అని పిలుస్తారు). సహజముగా వీరు ముఘల్ కి సంబంధించిన వారు కారు.  భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నివసించే నేటి మహిళలు ఘన్‌ఘాట్ ను/ వీల్‌ను (బట్టతో తల కప్పుకోవడం) ఎందుకు ఇంకా ఆచరిస్తున్నారు?...